అందరి టీవీ : డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం
వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు.లేకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటారని అని తెలిపారు