డ్రగ్స్ కేసులో మరో సినీ నటుడు

Date: 2024-09-27
news-banner



అందరి టీవీ/ డిజిటల్ : డెస్క్ ప్రత్యేకం 
డ్రగ్స్ కేసులో సినీ నటుడు అభిషేక్‎ అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇవాళ (సెప్టెంబర్ 26) గోవాలో అభిషేక్‎ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ సీసీఎస్‎కు తరలిస్తున్నారు.కాగా, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పీఎస్‎లో డ్రగ్స్ కేసుల్లో అభిషేక్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులపై న్యాయస్థానంలో దర్యాప్తు జరుగుతుండగా.. బెయిల్ మీద బయట ఉన్న అభిషేక్ కోర్టుకు హాజరు కావడం లేదు. ఈ కేసుల తర్వాత హైదరాబాద్ నుండి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. కోర్టుకు హాజరు కాకకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో రంగంలోకి దిగిన టీజీ న్యాబ్ పోలీసులు.. గోవాలో అభిషేక్‎ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‎కు తరలిస్తున్నారు.
image

Leave Your Comments