కులగణనపై ఎలాంటి అనుమానాలు వద్దు

Date: 2024-09-27
news-banner

అందరి టీవీ /డిజిటల్ :డెస్క్ ప్రత్యేకం 
కులగణనపై ఎలాంటి అనుమానాలు వద్దని, కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని, బీసీ కమిషన్ గడువు ముగిసిన వారం రోజుల్లోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కులగణన పూర్తి చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.  ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డగా తాను బీసీలకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. కొందరు కోఠీ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
image

Leave Your Comments