అందరి టీవీ /డిజిటల్ /హనంకొండ ప్రతినిధి
వర్కింగ్ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల నగరానికి చెందిన ఆంధ్ర జ్యోతి డెస్క్ జర్నలిస్ట్ కర్ణకంటి రామకృష్ణాచారి గుండెకు కంతి ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్య వచ్చింది. హైదరాబాద్‌లోని నీమ్స్ ఆస్పత్రి వైద్యులు ఎంతో క్లిష్టమైన గుండె ఆపరేషన్‌ను(ఓపెన్ హార్ట్ సర్జరి) జరిపి, కంతిని తొలగించారు. కాగా, రామకృష్ణాచారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని , వైద్య ఖర్చుల వివరాలను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల నాగరాజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ నుంచి లక్షా యాభై వేల రూపాయలను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల నాగరాజు, కోశాధికారి బోళ్ల అమర్, వైస్ ప్రెసిడెంట్లు దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ మంగళవారం కలిసి కృతజ్ఙతలు తెలిపారు. జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎమ్మెల్యేకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.