🔥తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్.. ఏఆర్ డెయిరీకి నోటీసులు..

Date: 2024-09-24
news-banner

     
అందరి టీవీ /డెస్క్ ప్రత్యేకం 


తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ.. ఏపీ సర్కార్ ను నివేదిక కోరడం జరిగింది.

తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీకి నోటీసులు ఇచ్చింది FSSAI. నెయ్యి కల్తీ పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమలకు జూన్, జూలైలో ఏఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. అందులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే, తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఏఆర్ డెయిరీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
image

Leave Your Comments