అందరి టీవీ /డిజిటల్ :హెల్త్
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు శుభవార్త చెప్పారు. ఈ మధ్యకాలంలో చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
అయితే, అందులో కొందరికి వైద్యం చేయించుకునే స్థోమత ఉంటుంది. మరికొందరికి ఉండకపోవచ్చు. అటువంటి రోగులు కేవలం మందుల మీద కాలం వెల్లదీస్తుంటారు. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా గుండె శస్ర్తచికిత్సలు చేయడానికి నిమ్స్ వైద్యులు ముందుకువచ్చారు.
నగరంలోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్‌లో ఈ నెల 22 నుండి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు యూకే వైద్యుల బృందం ప్రకటించింది. ప్రతిఏడాది విదేశాలకు చెందిన కొందరు వైద్యులు ఇలా ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేసేందుకు ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే గుండెకు రంధ్రం, ఇతర హార్ట్ సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నట్లు నిమ్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని నిమ్స్ సంచాలకులు బీరప్ప వెల్లడించారు.