కొండగట్టు అంజన్న సన్నిధికి.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Date: 2024-06-26
news-banner
అందరి టీవీ డిజిటల్ ,కరీంనగర్ జిల్లా ప్రతినిధి 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 29న కొండగట్టుకు రానున్నారు. గతం లో కొండగట్టు అంజన్న ను దర్శించుకుని, పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం విదితమే.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి భారీ విజయం సాధించడం, ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. భారీ విజయాన్ని సొంత చేసుకోవడంతో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకొని కొండగట్టు పర్యటనకు శ్రీకారం చుట్టారు. పవన్ రాక కన్ఫామ్ కావడంతో ఆయన అభిమానులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు
image

Leave Your Comments