📢 అందరి టివి డిజిటల్ న్యూస్ | పరకాల అప్డేట్: పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ మార్త రాజా బద్రయ్య బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి మరియు ప్రజాసేవకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ నియామకానికి సహకరించిన హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి రావు పద్మ రెడ్డి మరియు జిల్లా, రాష్ట్ర నాయకులకు గాజుల నిరంజన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
👇 మరిన్ని పరకాల, ఉమ్మడి వరంగల్ జిల్లా తాజా వార్తల కోసం అందరి టివి డిజిటల్ న్యూస్ పేజీని ఫాలో అవ్వండి!