అయినవోలు | నవంబర్ 26, 2026
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీ. ఉప్పలయ్య పిలుపునిచ్చారు.
కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలని, కనీస పెన్షన్ పెంచాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా అయినవోలు మండల సీఐటీయూ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద చలో ఢిల్లీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు లేబర్ కోడ్ల రద్దు, ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనాల అమలు, పెన్షన్ పెంపు తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా టీ. ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం, పనిగంటల పెంపు వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, టైమ్ స్కేల్, కంటింజెంట్, ఎన్ఎంఆర్, గౌరవ వేతన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
సంపన్నులకు రాయితీలు ఇవ్వడం మానేసి, వారి సంపదపై అధిక పన్నులు విధించి కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బోళ్ల వెంకటస్వామి, అంగన్వాడీ యూనియన్ నాయకులు సమ్మక్క, రేణుక, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు గాదె కుమార్, చంద్రయ్య, శ్రీనివాస్, ఏసుబు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అశోక్, ఆటో యూనియన్ నాయకులు ఎం. రాజు, లక్ష్మి, కొమరమ్మ, ఎలీషా, రజిత, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.


మా వార్తా ప్రయాణం... ప్రజల కోసం!
సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన సంఘటనను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ, సామాజిక, రాజకీయ, విద్యా, వైద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన వార్తలను మీకు అందిస్తున్నాం.
ప్రజల గొంతుకగా... ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా... వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం మీ ముందుకు వస్తుంది అందరి టీవీ డిజిటల్.
మరిన్ని తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, విశ్లేషణల కోసం మా YouTube ఛానల్‌ను Subscribe చేయండి. వీడియోను Like చేయండి. మీ బంధుమిత్రులకు Share చేయండి.
మీ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన వార్తలు, ప్రజా సమస్యలను మా దృష్టికి తీసుకురావడానికి మీ జిల్లా ప్రతినిధిని సంప్రదించండి.
అందరి టీవీ డిజిటల్
ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుక!
నేను మీ K. R. Patel. నమస్కారం!
9959143079