అందరి టీవీ డిజిటల్
హైదరాబాద్, ఆగస్టు 23:
హైదరాబాద్ ఉప్పల్లోని శిల్పారామంలో శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆధ్వర్యంలో నటరాజ పద అర్చన, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య అర్చన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.
అకాడమీ వ్యవస్థాపకురాలు, నాట్య మరియు సంగీత గురువు శ్రీమతి తులసి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం గణపతి శ్లోకంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. చిన్నారుల శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ శ్రీ కామిశెట్టి రాజు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళామణులు, సంగీతమణులకు సర్టిఫికెట్లు, మెమొంటోలను గురువు తులసి, అంజలి మీడియా గ్రూప్ సీఈఓ శ్రీమతి కొండపల్లి దీపికతో కలిసి అందజేశారు.
కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులతో పాటు ఇతర అతిథులను సన్మానించి మెమొంటోలు అందజేశారు.
చిన్నారుల సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు సీనియర్ వ్యాఖ్యాత రమణాచారి వ్యాఖ్యానం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కామిశెట్టి రాజు పటేల్ మాట్లాడుతూ.. భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించేందుకు అకాడమీ వ్యవస్థాపకురాలు, గురువు శ్రీమతి తులసి అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. ఇలాంటి గురువు పిల్లలకు లభించడం వారి అదృష్టమని అన్నారు.
చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన గురువు తులసిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాట్య, సంగీత కళాకారులు, చిన్నారుల తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొన్నారు.