అందరి టివి డిజిటల్ న్యూస్ వెబ్ డెస్క్| హైదరాబాద్:ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జూలై 28, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటూ జీవనం సాగించారు. ఆమె కుమార్తె కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను నవ్వించిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నుమూయడం సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
పావలా శ్యామల మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఆర్థిక సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:
పావలా శ్యామల: 98491 75713
#Hashtags
#AndhariTV #AndhariTVDigitalNews #PavalaShyamala #PavalaShyamalaDeath #SeniorActress