న్యూఢిల్లీ:📺 అందరి టీవీ డిజిటల్ న్యూస్:
దేశ రాజధానిలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటైన గురుతేజ్ బహాదూర్ (GTB) ఆస్పత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. అత్యవసర విభాగంలోని వార్డ్ నంబర్ 27లో చికిత్స పొందుతున్న మహమ్మద్ అక్బర్ అనే రోగిపై ఊహించని విధంగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.
నర్సింగ్ అధికారికి గాయాలు: ఫ్యాన్ కూలిపడిన సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నర్సింగ్ అధికారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
3 గంటల తర్వాత మృతి: ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత మహమ్మద్ అక్బర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఆస్పత్రి వర్గాల వాదన: ఫ్యాన్ పడటం వల్ల రోగి చనిపోలేదని, అతనికి ఉన్న పాత ఆరోగ్య సమస్యల (హెల్త్ కాంప్లికేషన్స్) వల్లే మృతి చెందాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.
🚨 పోలీసుల రంగ ప్రవేశం:
ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోగి మృతికి అసలు కారణం ఏంటనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.