అందరి టీవీ డిజిటల్ న్యూస్ | వెబ్ డెస్క్:
ఇప్పుడంతా కెమికల్ మయమైంది. మనం ప్రతిరోజూ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న కూరగాయల్లో దాదాపు 90 శాతం పూర్తిగా రసాయనాలతో నిండిపోయినవే ఉంటున్నాయి. ఒకప్పుడు రైతులు సేంద్రీయ వ్యవసాయ పంటలనే పండించే వారు. కానీ ప్రస్తుతం కెమికల్స్ వాడకానికి అలవాటు పడటంతో ఈ సాంప్రదాయ వ్యవసాయం పూర్తిగా మరుగునపడింది. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, భూతల్లి సారం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కెమికల్స్ ద్వారా పండించిన పంటలను తినడం వల్ల వంద ఏండ్లు బతకాల్సిన మనిషి.. యాబై, నలబై ఏండ్లకే వివిధ రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాడు. అందుకే ప్రభుత్వాలు సైతం రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ రైతుల్లో దీనిపై సరైన అవగాహన లేకపోవడం, ఇది రిస్క్‌తో కూడుకున్నదని భావించడం వల్ల కేవలం ధనవంతులు మాత్రమే ఈ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, సేంద్రీయ వ్యవసాయంలో పంట దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా.. దీనివల్ల లభించే లాభాలు అపారం.
సేంద్రీయ కూరగాయలను తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:
క్యాన్సర్, గుండె జబ్బులకు చెక్: సేంద్రీయ వ్యవసాయంలో పండించిన కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రోగాలు రాకుండా చూడటమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
మధుమేహం అదుపులో: గుండె జబ్బులు, డయాబెటీస్ ఉన్న రోగులు ఆర్గానిక్ కూరగాయలను తప్పక తినాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే మెగ్నీషియం టైప్ 2 మధుమేహాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
పుష్కలమైన పోషకాలు: సేంద్రీయ పద్ధతిలో పండించిన నారింజ పండ్లు, ఆకుపచ్చ కూరగాయల్లో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, కాల్షియం, జియాక్సంతిన్, పొటాషియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి.
జీర్ణవ్యవస్థ మెరుగుపడటం, బరువు తగ్గడం: ఆకుపచ్చ కూరగాయల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు, వీటిని తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువ ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది, ఫలితంగా సులభంగా బరువు తగ్గొచ్చు.
టాక్సిన్స్ దూరం: ఈ కూరగాయలు శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను (టాక్సిన్స్) సులభంగా బయటకు పంపేందుకు సహాయపడతాయి.
శాకాహారులకు ప్రోటీన్ నిధి: ఈ కూరగాయల్లో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మాంసాహారం తినని వారు వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పోషకాహార లోపం ఏర్పడదు.
రక్తపోటు నియంత్రణ: నిత్యం ఉల్లిగడ్డ, వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు (బీపీ) తగ్గుముఖం పడుతుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.#OrganicFarming #OrganicVegetables #HealthBenefits #HealthyLifestyle #OrganicFood #AgricultureAwareness #DiabetesCare #CancerPrevention #TeluguHealthTips #Andhari tv DigitalNewsTelugu