కొడుకును గొడ్డలితో నరికి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?#అందరిటీవీ#SuryapetNews #TelanganaNews #BreakingNews #DigitalNews #CrimeNews

Date: 2026-07-16
news-banner
 వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం 18 వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో నివాసం ఉంటున్న భూక్యా అచ్చికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త రాము కొన్నాళ్ల క్రితం మృతిచెందగా, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ఉన్నంతలో ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేసింది. కొడుకు విజయ్ ని కూడా ఇంటర్ వరకు చదివించింది.కొడుకు విజయ్ తనకు చేదోడు వాదోడుగా ఉంటాడని భావించింది. కానీ..మద్యం, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం మత్తులో డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఈ నెల 12వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఉన్న విజయ్‌పై తల్లి అచ్చి గొడ్డలితో దాడికి పాల్పడింది. కొద్దిసేపు ఇంటి బయట కూర్చున్న తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా, విజయ్ ప్రాణాలతో ఉన్నాడు. దీంతో ఆందోళన చెందిన అచ్చి.. తన కుమారుడిపై ఎవరో వ్యక్తులు దాడి చేశారని స్థానికులకు చెప్పటంతో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈ నెల 13వ తేదీ రాత్రి మృతిచెందాడు. కుమార్తె దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు విచారణ జరిపి నిందితురాలైన తల్లి అచ్చిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కన్నతల్లే కొడుకు చంపి.. ఎవరో చంపారంటూ ఫిర్యాదు చేసిందని.. విచారణలో కీలక విషయాలు వెలుచూశాయని పోలీసులు వెల్లడించారు.

Leave Your Comments