📺 ANDHARI TV DIGITAL
🏛️ POLITICAL DESK | హనుమకొండ
"మాజీల అబద్ధాల వేలం పాటను నమ్మొద్దు.. వరంగల్ అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యం"
మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఘాటు కౌంటర్
వరంగల్ నగర అభివృద్ధి, కుడా భూముల వేలంపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేసిన ఆరోపణలను
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అన్ని పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా
జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
📺 ANDHARI TV DIGITAL | 🏛️ POLITICAL DESK | హనుమకొండ
వరంగల్ నగర అభివృద్ధి పనులు, కుడా భూముల వేలం ప్రక్రియపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేసిన ఆరోపణలను హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
హనుమకొండ డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, వరంగల్‌లో మీడియా ముందుకు రావడానికి ధైర్యం లేక హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
రెడ్డిపురం ఎస్ఆర్ఎస్పీ భూముల్లోని క్వారీయింగ్ గుంతలను పూడ్చే పనులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయని తెలిపారు. భద్రకాళి చెరువు నుంచి తీసిన మట్టితో గుంతలు పూడ్చి, భవిష్యత్తులో అక్కడ ఎస్‌టీపీ పంప్ స్టేషన్ మరియు అందమైన పార్కు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో చేసిన పర్యావరణ ఆరోపణలపై స్పందిస్తూ, అక్కడ వర్షపు నీరు నిల్వ ఉండటమే తప్ప పక్షులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కుడా భూముల వేలం పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని, ఇంకా వెంచర్లలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విమర్శలు చేసే బదులు ఆసక్తి ఉంటే వేలంలో పాల్గొని ప్లాట్లు కొనుగోలు చేయవచ్చని మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
గత ప్రభుత్వ హయాంలో పార్కు కోసం కేటాయించిన భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపిస్తూ, ప్రస్తుతం ప్రజల కోసం శిల్పారామం నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కూడా విషప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.
నగర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు మానుకుని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యేకు హితవు పలికారు.