AndhariTv Digital | Hanumakonda District News
హోమియోపతి వైద్య విధాన పితామహుడు డాక్టర్ సామ్యూల్ హనీమన్ వర్ధంతి సందర్భంగా ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ (OHMA) మరియు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ (IIHP) సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
హనుమకొండలోని ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ (OHMA) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ (IIHP) కార్యాలయం,
డాక్టర్ బాసాని శ్రీకాంత్ క్లినిక్‌లో గురువారం ఉదయం 9.00 గంటలకు హోమియోపతి వైద్య విధాన పితామహుడు డాక్టర్ సామ్యూల్ హనీమన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హోమియోపతి వైద్య రంగానికి డాక్టర్ హనీమన్ అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హోమియోపతి వైద్య విధానం
ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యానికి చేసిన సేవలను పలువురు వైద్యులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఓరుగల్లు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ రావు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు, ఖజాంచి డాక్టర్ బాసాని శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, సీనియర్ హోమియో ఫిజీషియన్ డాక్టర్ బి. పవన్ కుమార్, డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు మాట్లాడుతూ, డాక్టర్ సామ్యూల్ హనీమన్ ప్రతిపాదించిన హోమియోపతి వైద్య విధానం నేటికీ ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ చికిత్సా విధానంగా కొనసాగుతోందని తెలిపారు. సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హోమియో వైద్యులు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం హోమియోపతి వైద్య విధానాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా చేర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు.