📍 వరంగల్ | ANDHARI TV DIGITAL | జిల్లా ప్రతినిధి
డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మహాసభ కార్యాలయంలో వైద్యులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్స్ విభాగం చైర్మన్ గుండా రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య మహాసభ అనేక సేవా కార్యక్రమాలతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్యవైశ్యులను, అలాగే సమాజానికి సేవ చేస్తున్న ప్రముఖులను గుర్తించి సన్మానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అన్నదాన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, జాబ్ మేళాలు, మహిళా దినోత్సవ వేడుకలు, ప్రతిభావంతులైన విద్యార్థుల సన్మానం వంటి అనేక సేవా కార్యక్రమాలను మహాసభ నిర్వహిస్తోందని చెప్పారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమని, అలాంటి వైద్యులను సన్మానించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు వైద్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రొఫెసర్ హనుమంతరావు, డాక్టర్ సాంబమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వైద్యులను గుర్తించి సన్మానిస్తున్న ఆర్యవైశ్య మహాసభ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైనప్పుడు తమ వంతు వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గందె శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ అజిత్, డాక్టర్ అహ్మద్, డాక్టర్ మేఘన, డాక్టర్ రాజు, డాక్టర్ వెంకట్ నారాయణ, డాక్టర్ సుజన్, డాక్టర్ సంపత్ సదానందం, డాక్టర్ శ్రీలత, మహిళా విభాగం కోశాధికారి తాటిపల్లి రాజమణి, కూచన శివ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 20 మంది వైద్యులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు