📌 దాతలు అందించిన ఆర్థిక సాయం ఖాతా నుంచి మాయమైందని బాధితురాలి ఆరోపణ.. విచారణ చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
మహబూబాబాద్ | ANDHARI TV DIGITAL | జిల్లా ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పోస్టాఫీసులో పనిచేసిన మాజీ బ్రాంచ్ మేనేజర్‌పై రూ.2 లక్షల నగదు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. దాతలు అందించిన ఆర్థిక సాయం పోస్టల్ ఖాతా నుంచి బాధితురాలికి తెలియకుండా డ్రా చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.
కొత్తగూడకు చెందిన సందీప్ అనారోగ్యంతో మరణించగా, ఆయన భార్య రచన తన చిన్నారితో కలిసి జీవిస్తోంది. కుటుంబ పరిస్థితిని గమనించిన దాతలు ఆమెకు సుమారు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించగా, ఆ మొత్తాన్ని కొత్తగూడ పోస్టాఫీసులోని పోస్టల్ ఖాతాలో భద్రపరిచినట్లు సమాచారం.
బాధితురాలి ఆరోపణల ప్రకారం, అప్పట్లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన రమేష్ 2025 డిసెంబర్ 27న ఆమెకు తెలియకుండా ఖాతా నుంచి నగదును డ్రా చేశారని పేర్కొన్నారు. అనంతరం ఆయన బదిలీపై అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ఇటీవల ఖాతాలో నగదు లేదని తెలుసుకున్న బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్నారి భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు లేకపోవడంతో సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
ఈ ఘటనపై స్థానికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్పందిస్తూ, ఆరోపణలపై పోస్టల్ శాఖ సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ANDHARI TV
ANDHARI TV DIGITAL అనేది ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు నిష్పాక్షికమైన వార్తలను అందించే ఆధునిక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. రాజకీయాలు, సామాజిక అంశాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపారం, ఆధ్యాత్మికం, కళలు, సంస్కృతి, క్రీడలు, వినోదం వంటి అన్ని రంగాల తాజా వార్తలను ప్రజలకు చేరవేయడం మా ప్రధాన లక్ష్యం.
ANDHARI TV వెనుక ఉన్న సంస్థ ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED. భారత ప్రభుత్వ కంపెనీ చట్టం ప్రకారం నమోదైన ఈ సంస్థ మీడియా, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్, OTT, ప్రొడక్షన్, కల్చరల్ ప్రమోషన్ వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తోంది.
ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన విభాగాలు:
- ANDHARI TV DIGITAL – డిజిటల్ న్యూస్ & మీడియా ప్లాట్‌ఫారమ్
- KAKATIYA BOOK OF NATIONAL RECORDS (KBNR) – జాతీయ స్థాయి రికార్డ్స్ సంస్థ
- ANJALI OTT – డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్
- ANJALI MEDIA ARTS & CULTURAL ACADEMY – కళలు, సంస్కృతి, ప్రతిభా వికాస వేదిక
- ఈవెంట్ మేనేజ్‌మెంట్ & అడ్వర్టైజింగ్ సర్వీసెస్
- డిజిటల్ మీడియా & బ్రాండింగ్ సొల్యూషన్స్
మా లక్ష్యం కేవలం వార్తలను ప్రసారం చేయడం మాత్రమే కాదు. సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడం, ప్రతిభావంతులను ప్రోత్సహించడం, సామాజిక బాధ్యతతో కూడిన జర్నలిజాన్ని అందించడం మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని విశ్వసనీయంగా చేరవేయడం.
ANDHARI TV DIGITAL ప్రతి వార్తను ఖచ్చితత్వం, పారదర్శకత, బాధ్యతతో ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉంది. ప్రజల గొంతుకగా, సమాజ అభివృద్ధికి తోడ్పడే మీడియా సంస్థగా ముందుకు సాగుతోంది.
మా నినాదం:
"సత్యం • సమాచారం • సమాజం కోసం"
ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED
"Innovating Media... Inspiring Society.