అందరి టీవీ డిజిటల్ / కరీంనగర్ జిల్లా ప్రతినిధి
కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘అంజన్న ఆశీర్వాద’ పాదయాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కోనరావుపేట సమీపంలో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
పాదయాత్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు ఉపయోగించిన డ్రోన్ కెమెరా పొరపాటున సమీపంలోని తేనెతుట్టను తాకింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన తేనెటీగలు అక్కడ ఉన్న కార్యకర్తలపై దాడి చేశాయి. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు కలకలం రేగింది.
తేనెటీగల దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే ఈ ఘటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు.
కొద్దిసేపు అంతరాయం ఏర్పడినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడంతో ‘అంజన్న ఆశీర్వాద’ పాదయాత్ర మళ్లీ కొనసాగింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు