నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో హీట్ ..! తగ్గేదేలే అంటున్న రెబెల్స్ అభ్యర్థులు ! నేడు విత్‌డ్రా ప్రక్రియకు ఆఖరి రోజు ?#NarsampetMunicipality #NarsampetElections #MunicipalElections #TelanganaPolitics #LocalBodyElections

Date: 2026-02-03
news-banner

అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట / వరంగల్ జిల్లా ప్రత్యేకం 
జరుగబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నేడు విత్‌డ్రా ప్రక్రియకు ఆఖరి రోజు కావడంతో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది.
ప్రత్యేకించి నర్సంపేట మున్సిపాలిటీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగనుంది.

అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద తీవ్రంగా కనిపిస్తోంది.
టికెట్ దక్కని కొందరు నేతలు తగ్గేదేలే అంటూ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
పార్టీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా…
రెబల్ అభ్యర్థులు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.

ఇక మరోవైపు ప్రతిపక్ష బి.ఆర్.ఎస్ పార్టీ కూడా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
బలమైన అభ్యర్థులతో పాటు
పూర్తి స్థాయి వ్యూహాలతో
అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని సిద్ధమైంది.

నర్సంపేట మున్సిపాలిటీలో 30 కౌన్సిలర్  వార్డులు ఉండగా 
ప్రతి డివిజన్ కీలకంగా మారింది.
ఎవరు గెలుస్తారు…?
ఎవరు ఓడిపోతారు…?
అన్న ఉత్కంఠ ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

రెబల్స్ విత్‌డ్రా చేయకపోతే
త్రికోణ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీంతో ఎన్నికల ఫలితం చివరి క్షణం వరకూ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

మొత్తానికి…
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలు
ఈసారి రసవత్తర రాజకీయ సమరంగా మారనున్నాయన్నది స్పష్టం.

నర్సంపేట నుంచి…
అందరి టీవీ న్యూస్.
image

Leave Your Comments

Trending News