ఆర్టీసీ డ్రైవర్ పై దాడి.. ఇద్దరు యువకుల అరెస్ట్ #Narsampet #RTCDriverAttack #TwoYouthArrested #TelanganaNews #RTC #BreakingNews #PoliceAction / Warngal District News AndarriTv digital

Date: 2025-11-26
news-banner
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా / నర్సంపేట ప్రతినిధి 
నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ పై  దాడి చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. 
  ఆర్టీసీ  డ్రైవర్ చీకటి వెంకటయ్య పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న బస్సులో స్టేజీ వద్ద దిగమని సూచించినందుకు, 
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు — దొంతి రాంరెడ్డి, దొంతి లక్ష్మారెడ్డి  ప్రయాణ సమయంలో 
వెంకటయ్యపై దాడికి పాల్పడ్డారు.

సిబ్బందిపై దాడి జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే నర్సంపేట 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం, బస్సు సిబ్బంది విధుల్లో అంతరాయం కలిగించినందుకు, 
ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అరెస్టయిన ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

ప్రభుత్వ సేవలను అంతరాయం చేసే ఇలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు

Leave Your Comments