అందరి టీవీ /డిజిటల్ /ప్రతినిధి
GWMC 8వ డివిజన్ ప్రాంతంలో గత 4 రోజుల నుండి మంచినీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి దృష్టికి రావడంతో గత 4 రోజుల నుండి మున్సిపల్ అధికారులు DEE రవి కిరణ్ మరియు AEE సతీష్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిన్న రాత్రి మళ్లీ నీళ్లు రావని తెలిసిన వెంటనే 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి నగర మేయర్ గౌ. గుండు. సుధారాణి గారి దృష్టికి తీసుకెళ్లారు సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు కానీ ఈ రోజు ఉదయం కూడ కొన్ని ప్రాంతాల్లో మళ్లీ సమస్య రావడంతో కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి ఆందోళనకు దిగడంతో అధికారులు AE సతీష్ గారు డివిజన్ పరిధిలో సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మన పండుగలకు మాత్రమే ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని ప్రజలు అధికారులను నిలదీశారు. కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి ప్రజలతో మాట్లాడి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంలో ప్రజలు ఆందోళన విరమించారు.