వరంగల్‌లో తీవ్ర విషాదం: పెట్రోల్ దాడికి గురైన కాంగ్రెస్ నాయకుడు ఆడుప మహేష్ కన్నుమూత

Date: 2026-07-19
news-banner
ఘటన పూర్తి వివరాలు: శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోటి లింగాల గుడి సమీపంలో మహేష్‌పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన మహేష్‌ను మొదట వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా, పరిస్థితి మరింత క్షీణించి ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పోస్టుమార్టం నిమిత్తం మహేష్ భౌతికకాయాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు తిరిగి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్నారు.   వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఆడుప మహేష్ శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘాతుకం జరిగింది. పాత కక్షల నేపథ్యంలోనే కొందరు రౌడీషీటర్లు మహేష్‌ను అడ్డుకొని, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనతో వరంగల్ నగర కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం మరియు ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, ఈ ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. #BreakingNews #Warangal #CongressLeader #AdupaMahesh #AndariTV #DigitalNews #Telangana Crime

Leave Your Comments