రంగారెడ్డి జిల్లాలో దారుణం | షాబాద్ దైవాలగూడలో ఆరుగురి హత్య | Crime News | ANDHARI TV DIGITAL/#ANDHARITVDIGITAL #CrimeDesk #RangaReddy #Shabad #BreakingNews #TelanganaNews #CrimeNews #POCSO #PoliceInvestigation #TeluguNews

Date: 2026-07-11
news-banner

📺 ANDHARI TV DIGITAL

🚔 CRIME DESK | రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య

పోక్సో కేసు కక్షతో ఘాతుకం.. నిందితుడి కోసం ముమ్మర గాలింపు


రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు నమోదైన కక్షతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు రాజ్‌కుమార్, 

 ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

📺 ANDHARI TV DIGITAL

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.  ఆరుగురిని కత్తితో దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన అనంతరం కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

హత్యకు గురైన వారిలో నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలు, అలాగే పోక్సో కేసు బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం ప్రకారం, హత్యల అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఆరుగురిని హత్య చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు.

ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి

Leave Your Comments