పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల.. వరంగల్‌లో కలకలం!#Warangal #FoodSafety #CurdPacket #BreakingNews #TelanganaNews #ConsumerAlert #AndariTV #AndariTVDigitalNews #LatestNews #WarangalNews 🚨📰

Date: 2026-06-22
news-banner

నాణ్యతపై ప్రశ్నలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారుడి డిమాండ్

వరంగల్ | అందరి టీవీ డిజిటల్ న్యూస్

ఆహార పదార్థాల నాణ్యతలో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడంతో వినియోగదారుడు షాక్‌కు గురయ్యారు.

బాధితుడు రఘునందన్ తెలిపిన వివరాల ప్రకారం, దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్‌ను ఇంటికి తీసుకెళ్లి కట్ చేయగా అందులో ఎలుక పిల్ల కనిపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన వెంటనే దుకాణానికి వెళ్లి యజమానిని నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.

అనంతరం బాధితుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు ఆధారంగా పెరుగు తయారీ కంపెనీకి చెందిన సంబంధిత బ్యాచ్ ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.

ఎలుక పిల్ల కనిపించిన ప్యాకెట్‌లోని పెరుగును సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు. అలాగే పెరుగు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

ఈ ఘటనతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఆహార ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave Your Comments