అందరి టీవీ డిజిటల్ / బ్రేకింగ్ న్యూస్ / వరంగల్ జిల్లా
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మద్యం మత్తు మరోసారి హింసకు దారితీసింది.
వైన్ షాపు ముందు ముగ్గురు యువకులు పరస్పరం సీసాలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వరంగల్ జిల్లా
నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డుపై ఉన్న లక్ష్మీ వైన్ షాపు సమీపంలో ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం సేవించారు.
మద్యం మత్తు అధికమవడంతో వారి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదంగా మారింది.
ఈ వాగ్వాదం కాస్తా ముదిరి.. ఒకరిపై ఒకరు సీసాలతో దాడి చేసుకునే స్థాయికి చేరింది.
ఈ పరస్పర దాడిలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
అందులో ఒకరు సమీపంలో ఉన్న కారు అద్దాలను పగలగొట్టినట్లు సమాచారం.
ఘటన స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని
గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దాడిలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో
మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనపై నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో జరిగే ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.