జయ జయహే తెలంగాణ పాట, సృష్టి కర్త రచయిత డాక్టర్ అందెశ్రీ కన్నుమూత | BreakingNews | AndariTV DIgital

Date: 2025-11-10
news-banner
అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూశారు. 
సోమవారం ఉదయం లాలాగూడ ఇంట్లో అందెశ్రీ స్పృహ తప్పి కిందపడిపోగా 
.. ఆయన్ను హూటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. 
అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు. అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు
జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీకి.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రూ.కోటి పురస్కారం అందించింది. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. 
కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు.

image

Leave Your Comments