సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి : బిల్లులు అడిగితే అరెస్ట్ చేస్తారా

Date: 2024-11-19
news-banner

అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
 వరంగల్&హన్మకొండ జిల్లాలకు ప్రజా పాలన విజయోత్సవ సభకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వినయ పూర్వకంగ శాంతి యుతంగ వినతి పత్రం ఇవ్వడానికి వరంగల్ జిల్లాలోని అన్ని గ్రామాల మాజీ  సర్పంచులు చేసిన ఆలోచనపై పోలీసులు ముందస్తుగా వారిని అరెస్ట్ చేసి నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
 అర్దరాత్రి పోలీసులు ఇంటి ముందుట ప్రత్యక్షమై  అక్రమ అరేస్టులు చేసి నెక్కోండ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి అక్కడ నుండి నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించిన తీరు మిమ్మల్ని ఒక దొంగలాగ వ్యవహరిస్తున్న తీరులాగా అనిపించింది ఇది చాలా బాధాకరం 
అని 
 ఈరోజు ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలో పర్యటన సందర్భంగా సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు పై ముఖ్యమంత్రి ని అడ్డకుంటారనే నేపంతో ముందస్తు అరెస్టు చేయడం ఇది హేయమైన పిరికి పంద చర్యగా భావిస్తున్నాము
 సర్పంచుల ను ముందస్తు అరెస్ట్ చేసిగొంతును నొక్కి పట్టి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు మీరు కూడా మాకు సహకరించాలి అని ఈ సందర్బంగా కోరడం జరిగినది.ఈ ప్రభుత్వం మొండివైకరి చేస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు ఇప్పటి ప్రభుత్వం గతంలో మేము అధికారంలోకి వస్తే వెంటనే బిల్లు చెల్లిస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేసి అదికారంలోకి వచ్చింది అలాగే మంత్రి సీతక్క గారు సర్పంచ్ లను గత ప్రభుత్వం మోసం చేస్తోంది మేము అధికారంలోకి వస్తే వెంటనే సర్పంచులు చెల్లిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన హామీలను మర్చి పోయి కనీసం  సర్పంచ్ లు పడే బాధలకు స్పందన కూడా  లేదు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ ల సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బిల్లులు క్లియర్ చేయడానికి గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతుబంధు అమౌంట్ 7500 కోట్లురూపాయల  రైతుల కోసం కేటాయిస్తే అట్టి డబ్బులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బిల్లుల కోసం డైవర్ట్ చేసి చెల్లించడం జరిగింది కానీ రాష్ట్రంలో దాదాపు 12,000 మంది సర్పంచులు రోజుకు ఒకచోట ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఏర్పడుతున్న పట్టింపు లేనట్టు ముసలి కన్నీరు కారుస్తుంది దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహిస్తే బాగుంటుంది లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని సర్పంచుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని డిమాండ్ చేస్తున్నాము.అని  నెక్కోండ మండల సర్పంచ్ ల ఫోరం  Ex సర్పంచ్ మాదాసు రవి అన్నారు
image

Leave Your Comments