వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ...

Date: 2024-10-19
news-banner

అందరి టీవీ /డిజిటల్ /ప్రతినిధి 
 జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ వారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు 2024 పోస్టర్ ను వరంగల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇంద్రసేనా రెడ్డి అధ్యక్షతన వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ జ్ఞానేశ్వర్  ఆవిషరించారు.నవంబర్ 7న పాతశాల స్థాయి,నవంబర్ 21న మండలస్థాయి,నవంబర్ 28న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు డిసెంబర్ 14,15,16 తేదీలలో ఆదిలాబాద్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని.ఇంద్రాసేనా రెడ్డి తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థులకు  మక్కువ కలిగించేందుకు మరియు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ ,జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు సుధాకర్, కోశాధికారి అశోక్,గౌరవ అధ్యక్షులు పిండం భాస్కర్, చెకుముకి కన్వీనర్ ఎండి రాయబోస్, పర్యావరణ కమిటీ కన్వీనర్ బూరుగు నవీన్, విద్యా కమిటీ కన్వీనర్ మాధవ రెడ్డి, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సురేష్, జిల్లా కార్యదర్శులుడా సామల.శశిధర్ రెడ్డి, పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
image

Leave Your Comments