అందరి టీవీ డిజిటల్ న్యూస్: నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.అనంతరం విద్యార్థులు ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని శ్రావ్యంగా ఆలపించగా, జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని ప్రధానోపాధ్యాయులు స్వీకరించారు.
పీఈటీ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులు అద్భుతమైన పిరమిడ్స్‌ను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభినయాలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. చివరగా పీఈటీ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాజ్యలక్ష్మి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంపత్, మెప్మా రిసోర్స్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.